Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఇకపై అది జరగదు..మన జలాలు - మన హక్కు : ప్రధాని మోడీ

ఇకపై అది జరగదు..మన జలాలు – మన హక్కు : ప్రధాని మోడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు. ఇక నుంచి భారత్‌కు చెందిన జలాలు దేశ ప్రయోజనాలకే వినియోగించబడతాయని మోడీ పేర్కొన్నారు.
భారతీయ జలాలు ఇప్పటివరకు వెలుపలికి వెళ్లాయని, ఇకపై అది జరగదని మోడీ అన్నారు. మన జలాలు – మన హక్కు అంటూ ప్రధాని మోడీ స్పష్టం చేశారు. మన జలాలు ఇకపై మన అవసరాలకే వినియోగిస్తామని ఆయన అన్నారు.
చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్థాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న తరుణంలో, జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ప్రాజెక్టు నుండి ప్రవాహాలను తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో మోడీ ఈ ప్రకటన చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad