- Advertisement -
టోక్యో: రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అక్కడ బుల్లెట్ రైలులో ప్రయాణించారు. ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి టోక్యో నుండి 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెండారుకు బుల్లెట్ రైలులో ప్రయాణించారు. ప్రధాని మోడీతో తన ప్రయాణ చిత్రాలను పంచుకుంటూ, జపాన్ ప్రధాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ”ప్రధానమంత్రి మోడీతో సెండారుకు వెళ్తున్నాను. నిన్న రాత్రి మాదిరిగానే, నేను కారులో ఆయనతో పాటు వెళ్తాను.” అంతకుముందు ప్రధాని మోడీ 16 జపాన్ ప్రిఫెక్చర్ల గవర్నర్‌లను కలిశారు.
- Advertisement -