- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్; వ్యవసాయ రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా అందిస్తున్న నిధులను ఆగస్టు 2న (రేపు) విడుదల చేయనుంది. యూపీలోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ నిధులు విడుదల చేయనున్నారు. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.7 కోట్ల రైతుల ఖాతాల్లోకి రూ.20,500 కోట్లు జమ చేయనున్నారు. ఏపీలో రైతులకు పీఎం కిసాన్ రూ.2 వేలతో కలిపి ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో భాగంగా రూ.7 వేలు జమకానుంది.
- Advertisement -