నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల పరిధిలోని ఫర్టిలైజర్ దుకాణాలలో మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు తనిఖీలు నిర్వహించారు. మండలంలోని మామిళ్ళపల్లిలోని శ్రీ తిరుమల ట్రేడర్స్, ఉప్పునుంతలలోని ఆగ్రో రైతు సేవ కేంద్రం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) వద్ద తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశం మండలంలోని రైతులకు ఎరువుల కొరత లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు ఉన్నాయా అనే దానిపై సమీక్ష చేయడం. ఎరువుల నిల్వలు, సరఫరా వివరాలు, అమ్మకాల రికార్డులు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో అచ్చంపేట సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం. చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారి రమేష్, ఆయా షాపుల ఫర్టిలైజర్ యజమానులు పాల్గొన్నారు.