కంతి మధు.. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి
ఉంగరం గుర్తు కేటాయింపు
నవతెలంగాణ – అలేరు రూరల్
గ్రామంలో ముఖ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తా అని శారాజిపేట కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంతి మధు నవ తెలంగాణతో అన్నారు. ఆలేరు మండలం శనివారం నాడు శారాజీపేట గ్రామంలో కాంగ్రెస్ వార్డు మెంబర్లను తనను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఎన్నికల్లో సర్పంచ్ పోటీకి ఉంగరం గుర్తు అధికారులు కేటాయించినట్లు చెప్పారు. 20 సంవత్సరాలుగా శారాజిపేటలో ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నానని తనకి ఈసారి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం పట్ల ప్రభుత్వ విఫ్ బీర్ల ఐలయ్యకు బత్తుల నరేందర్ రెడ్డి చిలుకు కిష్టయ్య బండ పర్వతాలు చీర బోయిన కృష్ణమూర్తి పుట్టల కిష్టయ్య కాంగ్రెస్ కార్యకర్తలు తనను సర్పంచ్ గా ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
శారాజిపేట గ్రామ సర్పంచ్ గా తనని గెలిపిస్తే వీధిలైట్లు మంచినీటి సమస్య మురికి కాలువలు తో పాటు ప్రభుత్వం నుండి వచ్చే కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, సీఎం ఆర్ ఎఫ్ ఫండ్ తో వెంట వెంటనే ఇప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి సలీం మాట్లాడుతూ .. శారాజిపేట ప్రజలపై నమ్మకంతో కంతి మధును సర్పంచిగా గెలిపిస్తారని ఎంతో నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారని వారి కోరికలు నెరవేర్చి ఎమ్మెల్యే కు కానుకగా ఇవ్వాలన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో కాలంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండేళ్లలోనే సన్న బియ్యం రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు రుణమాఫీ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చేనేత కార్మికుల రుణమాఫీ లాంటి అనేక పథకాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ది అన్నారు.
నియోజవర్గంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని శారాజిపేట మరింత అభివృద్ధి కావాలంటే అధికారంలో ఉన్న పార్టీ నుండి పోటీ చేస్తున్న కంతి మధును గెలిపించాలని చేతికి తొడిగే ఉంగరం గుర్తు పెట్టుకోవాలని అదేవిధంగా వార్డ్ మెంబర్ల అందరిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పోటీ చేసే వార్డ్ నెంబర్లు దూడల శ్రీధర్,చిలుకు సుస్మిత, యాకయ్య,బోదాసు సంధ్య,సుమలత,కంతి బిక్షపతి, కంతి బాలరాజు,పెండ్యాల సత్యనారాయణ, పుట్టల అనిత,పెండ్యాల నాగరాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.



