నవతెలంగాణ – మల్హర్ రావు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కోతుల బెడద తలనొప్పిగా మారుతోంది.మండలంలోని తాడిచెర్ల, మల్లారం, పెద్దతూoడ్ల, కొయ్యుర్ తోపాటు పలు గ్రామాల్లో కోతుల బెడద అధికంగా ఉంది. ఈ సమస్యను తీర్చాలంటూ గ్రామస్తులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు కోతుల బెడదను తీరిస్తేనే తాము ఓటు వేస్తామంటూ గ్రామస్తులు కరాఖండిగా చెబుతున్నారు.కోతులు అడవులను వదిలి జనారణ్యంలోకి వచ్చాయి. ఊర్లలో గుంపులు, గుంపులుగా సంచరిస్తూ జనాలను హడలెత్తిస్తున్నాయి. ఇళ్లు, దుకాణాల్లోకి చొరబడి, ఆహారం, నిత్యావసర సరుకు లను ఎత్తుకెళ్తున్నాయి. పంటలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తున్నాయి. ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. చివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలపైనా దాడి చేసి రైతుల ధాన్యాన్ని చిందర వందర చేశాయి. దాంతో ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసే వారు కోతుల సమస్య పరిష్కరిస్తామంటూ హామీ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
కోతుల పంచాయితీ..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



