Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆధార్ సెంటర్ వద్ద కోతుల బెడద

ఆధార్ సెంటర్ వద్ద కోతుల బెడద

- Advertisement -

నవతెలంగాణ  – ఆర్మూర్ 
పట్టణంలో 29 వార్డు ప్రాంతంలో మీసేవ కేంద్రం, ఆధార్ కార్డు సెంటర్ చుట్టుపక్కల గ్రామస్తులు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో కోతులు గుంపులు గుంపులుగా వచ్చి ఇబ్బందులకు గురి చేసన్నాయని అమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సయ్యద్ అవేజ్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. మీ సేవ ఆధార్ కార్డు సెంటర్ కి వచ్చే ప్రజలపైకి విరుచుకుపడుతున్నాయని అన్నారు.  ప్రజలు భయాందోళన గురవుతున్నారని అన్నారు. కోతులను పట్టుకొని ఇతర దూర ప్రాంతంలో విడిచి పెట్టాలని, కుక్కలు కూడా కాలనీలో సంచరించడం వల్ల ప్రజలు కాలనీవాసులు భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ను కోరినారు. ఈ కార్యక్రమంలో అమ్ ఆద్మీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -