Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నెల రోజులు పోషణ మాసాన్ని నిర్వహించాలి: కలెక్టర్ 

నెల రోజులు పోషణ మాసాన్ని నిర్వహించాలి: కలెక్టర్ 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
జిల్లాలో నెల రోజులపాటు పోషణ మాసాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.  సోమవారం మహిళాభివృది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణా మాసం కార్యక్రమాన్ని కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించారు. ఈ కార్య్కక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ గ్రామ స్థాయిలో 17 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 16 వరకు నెల రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్  ఆదేశించారు.

ఇంటింటికీ న్యూట్రీషన్  పైన అవగాహన పెంచాలన్నారు. గ్రామ స్థాయిలో అంగన్వాడీ టీచర్ లు, ఆశ లు కలిసి పని చేయాలని సూచించారు. గ్రామ సభ లో పోషకాహార మాసాన్ని నిర్వహించాలని, సంబందిత అధికారులకు తెలియచేసారు.  లోప పోషణ గల చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు.  ఆరోగ్య శిభిరాలను నిర్వహించాలని సంబందిత అధికారులకు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, జిల్లా  విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా ఆరోగ్య, వైద్యశాఖ అధికారి చంద్రశేఖర్,  పోషణ్ అభియాన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -