- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుఫాను.. కాకినాడ సమీపం వద్ద ఉప్పాడ తీరం దాటుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. సోమవారం సముద్ర తీరాన్ని కాకినాడ ఆర్డిఓ మల్లి బాబు అధికారులతో కలిసి పరిశీలించారు మంగళవారం రాత్రి తీరం దాటే సమయంలో ఈదురు గాలులు అధికంగా వీస్తాయని తీర ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అవసరం లేకుండా ఎవరు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యూఎస్, తదితర శాఖ అధికారులు తీర ప్రాంత గ్రామాలలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ గ్రామస్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపుతున్నారు.
- Advertisement -



