ఆకస్మిక వరదల ముప్పు : ఐఎండీ అంచనా
న్యూఢిల్లీ : మనదేశంలో సెప్టెంబర్ నెలలో మరింతగా వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయని హెచ్చరిం చింది. ఆదివారం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ మీడియా సమావేశంలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర మాట్లాడుతూ సెప్టెంబర్‌లో కురవనున్న భారీ వర్షాలు ఉత్తరాఖండ్‌లో కొండ చరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలకు దారితీస్తాయని చెప్పారు. దక్షిణ హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్‌లో సాధారణ జీవితానికి అంతరాయం కలిగించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉత్తరాఖండ్‌లో చాలా నదులు ఆవిర్భవించాయని, భారీ వర్షపాతం వల్ల వాటికి సంభవించే వరదలు దిగువున్న ఉన్న నగరాలు, పట్టణాలను ప్రభావితం చేస్తాయని చెప్పారు.
వాయువ్య భారతంలో
2001 తరువాత ఆగస్టులోనే అత్యధిక వర్షపాతం
వాయువ్య భారతదేశంలో ఆగస్టులో 265 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2001 తర్వాత ఈ నెలలో ఇదే అత్యధికమని ఐఎండీ తెలిపింది. 1901 తర్వాత 13వ అత్యధిక వర్షపాతమని పేర్కొంది. వర్షాకాలంలో మూడు నెలల్లో ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని తెలిపింది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 మధ్య వాయువ్య భారత్‌లో మొత్తం 614.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, ఇది సాధారణం 484.9 మి.మీ కన్నా సుమారు 27శాతం అధికం. తీవ్రమైన వాతా వరణ పరిస్థి తుల కారణంగానే అధిక వర్షాలు కురిసినట్టు ఐఎండీ పేర్కొంది.
పంజాబ్‌లో దశాబ్ద కాలంగా ఎప్పుడు లేనంతగా వరదలు ముంచెత్తాయి. వేల హెక్టార్ల వ్యవసాయ భూమి నీట మునిగింది. లక్షలాది మంది నిరాశ్రయు లయ్యారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ములలో క్లౌడ్‌బరెస్ట్‌లు సంభవించాయి.
దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే ఓ 31 శాతం అధిక వర్షపాతం
దక్షిణ భారతదేశంలో ఆగస్టులో 250.6 మి.మీ వర్షపాతం నమోదవగా, సాధారణం కంటే 31శాతం అధికం. ఇది 2001 తర్వాత మూడవ అత్యధిక వర్షపాతం, 1901 తర్వాత ఎనిమిదవ అత్యధిక వర్షపాతం అని ఐఎండీ తెలిపింది. జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 మధ్య ఈ ప్రాంతంలో మొత్తంగా 607.7 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం 556.2 మి.మీ కన్నా 9.3 శాతం అధికంగా పేర్కొంది. ఆగస్టులో దేశవ్యా ప్తంగా 268.1 మి.మీ వర్షపాతం నమోదు కాగా, ఇది సాధారణం కన్నా సుమారు ఐదు శాతం అధిక మని ఐఎండీ వెల్లడించింది. జూన్ నుంచి ఆగస్ట్ వరకు మూడు నెలల్లో 743.1మి.మీ వర్షపాతం నమోదు కాగా, సాధారణం కన్నా సుమారు ఆరు శాతం అధికమని పేర్కొంది.
సెప్టెంబర్‌లో మరింత వర్షపాతం
- Advertisement -
- Advertisement -