- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు 5 వేలకు పైగా బస్సులు నడపాలని టీజీ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో 2,500.. ఏపీకి 3 వేల వరకు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని జనవరి 9వ తేదీ నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఒకట్రెండు రోజుల్లో ఈ స్పెషల్ బస్సుల వివరాలు ప్రకటిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
- Advertisement -



