Sunday, October 26, 2025
E-PAPER
Homeసినిమారూ.100 కోట్లకి పైగా..

రూ.100 కోట్లకి పైగా..

- Advertisement -

హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ నటించిన లేటెస్ట్‌ సినిమా ‘డ్యూడ్‌’. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్‌ డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఈనెల 17న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రూ.100 కోట్లకి పైగా వసూలు చేసింది. ఈ సందర్భంగా మేకర్స్‌ ‘డ్యూడ్‌’ బ్లాక్‌బస్టర్‌ 100 కోట్ల జర్నీ ఈవెంట్‌ని నిర్వహించారు. హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ మాట్లాడుతూ,’ ఈ సినిమా 100 కోట్లు కలెక్షన్స్‌ని క్రాస్‌ చేసింది. తెలుగు ఆడియన్స్‌కి కృతజ్ఞతలు. ఆడియన్స్‌ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ‘లవ్‌ టు డే, డ్రాగన్‌’ చిత్రాలకు ఎంత ఆదరణ ఇచ్చారో ఈ చిత్రానికి కూడా అంతకంటే ఎక్కువ ఆదరణ అందించారు’ అని తెలిపారు. ‘ఈ సినిమా సక్సెస్‌ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమాకి అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. మా సంస్థలో పరిచయమైన భరత్‌ కమ్మ, నితీష్‌ రానా, బుచ్చిబాబు సానా చాలా పెద్ద దర్శకులు అయ్యారు. ఇప్పుడు అదే కేటగిరిలో కీర్తి చేరటం చాలా ఆనందంగా ఉంది.

ఇంత మంచి సక్సెస్‌ ఇచ్చిన ఆడియన్స్‌కి థ్యాంక్స్‌’ అని నిర్మాత వై రవిశంకర్‌ చెప్పారు. డైరెక్టర్‌ కీర్తి ఈశ్వర్‌ మాట్లాడుతూ,’ ప్రదీప్‌ రంగనాథన్‌కి ఇది హ్యాట్రిక్‌ మూవీ. ఇది నా ఫస్ట్‌ సినిమా. ఇలాంటి కాంబోలో అద్భుతమైన విజయం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా అద్భుతంగా రన్‌ కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అని తెలిపారు. ‘సినిమా థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. కొన్ని సీన్స్‌ ఎన్నిసార్లు చూసినా థియేటర్స్‌లో బోర్‌ కొట్టడం లేదు. ప్రదీప్‌, మమిత యాక్టింగ్‌ సూపర్బ్‌’ అని మైత్రి డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి చెప్పారు. హీరోయిన్‌ మమిత బైజు మాట్లాడుతూ,’ ఈ సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సినిమా 100 కోట్లు కలెక్షన్స్‌ క్రాస్‌ చేసింది. ఇది మరింత స్పెషల్‌ మూమెంట్‌’ అని అన్నారు. నిర్మాత ఎస్‌కేఎన్‌ చిత్ర విజయాన్ని కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -