నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం దోమల నివారణ చర్యలను చేపట్టారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందితో వర్షం నీరు నిలిచిన గుంతల్లో, మురికి కాలువల వెంట, మినీ వాటర్ ట్యాంకుల వద్ద దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. దోమల లార్వాను చంపేందుకు, దోమల నివారణ కోసం నీటి మడుగులో ఆయిల్ బాల్స్ వేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి గంగాజమున మాట్లాడుతూ నీటి గుంతల్లో ఆయిల్ బాల్స్ వేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం ద్వారా దోమల వృద్ధిని నివారించవచ్చని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంట్లోని చెత్తను వీధిలో, మురికి కాలువలలో పాడేయకుండా ఇంటిలోనే తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా నిల్వ ఉంచాలని సూచించారు.గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులోనే వేయాలన్నారు.మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. గ్రామంలో చేపట్టిన దోమల నివారణ చర్యలు పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ పరిశీలించారు. దోమల నివారణ చర్యలపై సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు.
కమ్మర్ పల్లిలో దోమల నివారణ చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES