నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ఆయా కాలనీలో ఆదివారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలు చేపట్టారు. పలు కాలనీలలో పంచాయతీ సిబ్బంది ఫాగింగ్గ్ చేశారు. ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి మొక్కల్ని చంపేందుకు గడ్డి మందును పిచికారి చేశారు. ఇటీవల కురిసిన వర్షం నీరు నిలిచిన గుంతల్లో, మురికి కాలువల వెంట దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లారు.
దోమల లార్వాను చంపేందుకు, దోమల నివారణ కోసం నీటి మడుగులో ఆయిల్ బాల్స్ వేశారు. నీటి గుంతల్లో ఆయిల్ బాల్స్ వేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం ద్వారా దోమల వృద్ధిని నివారించవచ్చని పంచాయతీ కార్యదర్శి గంగాజమున తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామంలోని అన్ని కాలనీల్లో పారిశుధ్య కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా గ్రామపంచాయతీ సిబ్బందికి సహకరించాలని ఆమె కోరారు.
కమ్మర్ పల్లిలో దోమల నివారణ చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES