Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్దోమలు బాబోయ్ దోమలు.. మండలంలో ఫాగింగ్ లేకపాయే

దోమలు బాబోయ్ దోమలు.. మండలంలో ఫాగింగ్ లేకపాయే

- Advertisement -

భారీగా పెరుగుతున్న సీజనల్ వ్యాధులు
గ్రామ ప్రజల గురించి పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – కాటారం

కాటారం కేంద్రంలో ప్రజలు దోమల బెడతతో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. గ్రామ పంచాయతీల అసమర్థత వల్ల పారిశుద్ద్య నిర్వహణ సక్రమంగా జరుగడం లేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో పిచ్చి మొక్కలు, కుంటల్లో నీరు నిల్వ ఉంటోంది. దీని వల్ల దోమల బెడద ఎక్కువవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని నివారించేందుకు గ్రామపంచాయతీలు చేస్తున్న కృషి అంతంత మాత్రంగానే ఉంది. ఫాగింగ్ మిషన్లు ఉన్నప్పటికీ వాడకుండా గ్రామ పంచాయతీ నుండి బయటకు తీయకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి కాలం గడుపుతూ వస్తున్నాడని ప్రజలు విమర్శిస్తున్నారు.

గ్రామంలో దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగి ప్రజలు అనేక సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. గ్రామంలో ఫాగింగ్ చేయకపోవడం వల్ల దోమల వ్యాప్తి పెరుగుతోంది.దీనివల్ల ప్రజలు డెంగ్యూ,మలేరియా,ఐఫోడ్,వైరల్ జ్వరం వంటి రోగాల బారిన పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వర్షాకాలం నుండి అసలు ఫాగింగ్ చేసిన దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కనీసం వీధులలో బీజింగ్ పౌడర్ చల్లడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో ఫాగింగ్,బీజింగ్ పౌడర్ చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad