Wednesday, July 9, 2025
E-PAPER
Homeహైదరాబాద్తల్లి కూతుర్లు అదృశ్యం

తల్లి కూతుర్లు అదృశ్యం

- Advertisement -

నవతెలంగాణ-హయత్‌ నగర్‌
తల్లి, కూతుర్లు అదశ్యమైన ఘటన హయత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద అంబర్‌ పేట, సాయి నగర్‌ కాలనీకి చెందిన తుమ్మలపల్లి రవీందర్‌ రెడ్డికి మానస తో 20 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వారికి ఇద్దరు కూతుర్లు. నెల రోజుల క్రితం తిరుమలగిరి సూర్యాపేట జిల్లాకు వెళ్లాడు.10 రోజుల తర్వాత భార్యకి ఫోన్‌ చేసి వేసవికాలం సెలవులు కదా పిల్లలని తీసుకొని వాళ్ళ సొంత ఊరు అయిన నల్గొండలోని నాంపల్లి మండలం రేవల్లికి వెళ్ళమనగా మానస పోను అని వారించింది. దాంతో రవీందర్‌ రెడ్డికి కోపం వచ్చి డబ్బులు పంపడం ఆపేశాడు. రవీందర్‌ రెడ్డి ఈనెల 11న మధ్యాహ్నం 02:00 గంటలకు ఇంటికి వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. మానస, ఇద్దరు కూతుర్లు అయిన సుశ్రిత, తేజస్వి గురించి ఇంటి యజమానిని అడగగా వాళ్ళు బట్టలు సర్దుకుని వెళ్లినారని చెప్పగా వాళ్ళ గురించి ఇప్పటివరకు వస్తారేమో అని ఎదురు చూసి చుట్టుపక్కల ప్రాంతాలలో, బంధువుల దగ్గర వెతికిన ఎటువంటి ఆచూకీ లభిం చలేదు. హయత్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -