Friday, January 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్య

పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్య

- Advertisement -

తల్లీకూతురు మృతి, కుమారుడి పరిస్థితి విషమం
భర్త మరణాన్ని తట్టుకోలేకనే అఘాయిత్యం..


నవతెలంగాణ-కల్వకుర్తి
ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కల్వకుర్తి పట్టణంలో కలకలం రేపింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్‌ చౌరస్తాలో బుక్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న భీంశెట్టి ప్రకాష్‌(47) నెల రోజుల కిందట గుండె పోటుతో మృతిచెందాడు. భర్త మృతిని తట్టుకోలేక భార్య భీంశెట్టి ప్రసన్న(38) గురువారం మధ్యాహ్నం కూతురు మేఘన(13), కుమారుడు అశ్రీత్‌ రాం(15)కు అన్నంలో విషం కలిపి తినిపించింది. ఆ తర్వాత ఆమె కూడా విషం కలిపిన అన్నం తిన్నది. ప్రసన్న తమ్ముడు ఇంటికి వచ్చి డోరు తీయగా ముగ్గురూ అపస్మారక స్థితిలో కనిపిం చారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి తల్లి, కూతురు మృతిచెందారు. కుమారుడు ప్రాణంతో బయటపడ్డాడు. అతను ప్రస్తుతం పట్టణంలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -