– జన్నారం మండలంలో అమానుష ఘటన
నవతెలంగాణ-జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో అమానుష ఘటన జరిగింది. 9 నెలల పాపతోపాటు తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లీబిడ్డతో మృతితో రేండ్లగూడలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్‌ఐ గొల్లపెల్లి అనూష తెలిపిన వివరాల ప్రకారం.. రేండ్లగూడ గ్రామానికి చెందిన చెటుపల్లి శ్రవణ్‌కు జగిత్యాల జిల్లా సారంగపూర్‌కు చెందిన స్పందన(24)తో నాలుగేండ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని స్పందన మానసికంగా కుంగిపోయేది. పలుమార్లు తాను చనిపోతానని సన్నిహితులతో చెప్పేది. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో చిన్న కూతురు వేదశ్రీ(9 నెలలు)కి అన్నం తినిపించిన అనంతరం పాపతోపాటుగా వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వారు కన్పించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అనుమానంతో బావిలో చూడగా విగతజీవులుగా కన్పించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ అనూష సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీయించారు. మృతురాలి తల్లి భూదారపు ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వెల్లడించారు.
చంటిబిడ్డతో సహా తల్లి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



