Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ ఐకెపి కార్యాలయంలో అమ్మకు అక్షరమాల పై శిక్షణ..

మద్నూర్ ఐకెపి కార్యాలయంలో అమ్మకు అక్షరమాల పై శిక్షణ..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి రేణుక అధ్యక్షతన మద్నూర్ మరియు డోంగ్లి మండలం లోని గ్రామ సంఘాల పాలకవర్గ సభ్యులకు, వివో ఏ లకు అమ్మకు అక్షర మాల పైన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ లు  శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం లో ఉన్న చదువురాని ప్రతి మహిళ కు ఉల్లాస్ కార్యక్రమం లో భాగంగా చదువు చెప్పాలని కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ లు దుర్గ, సంగీతలు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణలో వారికి అక్షర వికాసం పుస్తకంలో  ఉన్న విషయాలు వివరించారు. వాటిలో మనం చదవగలం, ఆదాయం పెంచుకుందాం, పోషకాహారం, బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడం, చట్టాన్ని తెలుసుకుందాం లాంటి మొదలగు విషయాలను చక్కగా వివరించడం జరిగింది. అక్షరాస్యత పైన గ్రామ సంఘంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షణ చేయాలని చెప్పడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి మండల సమాఖ్య ఏపీఎం జగదీశ్ కుమార్, మండల సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, సీసీ లు, అకౌంటెంట్,అన్ని గ్రామ సంఘాల పాలకవర్గ సభ్యులు, వివో ఏ లు హాజరు కావడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -