సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
మోటార్ వాహన చట్టం -2019 ని సవరించాలి అని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టి డబ్ల్యూ ఎఫ్ -సిఐటియు) నగర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత కటారి రాములు వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. ఆటో, క్యాబ్,డీసీఎం, స్కూల్ బస్ కార్మికుల పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను అన్ని మరిచి ట్రాన్స్పోర్ట్ రంగా కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుంది అన్నారు.
ఫ్రీ బస్సు వల్ల నష్టపోయినటువంటి ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12000/- ఇవ్వాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని, అదేవిధంగా ఓలా ఉబర్ రాపిడో లాంటి ప్రైవేట్ సంస్థ లు ఆటో, క్యాాబ్ కార్మికులకు సరైన రేట్లు ఇవ్వకపోవడం వల్ల కూడా డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి ఓలా ఉబర్ రాపిడో లాంటి ప్రైవేట్ సంస్థలను రద్దుచేసి ఆ స్థానంలో ప్రభుత్వం నుండి ఒక కొత్త యాప్ తీసుకొచ్చి ఆటో క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వమే సరైన రేట్లు అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రవాణా రంగంలో పనిచేసే కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి చనిపోయినటువంటి కార్మికులకు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ప్రతి బస్ స్టాప్ దగ్గర షాపింగ్ మాల్స్ వద్ద ఆటో స్టాండ్ ఏర్పాటుకు పర్మిషన్లు ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం, నూతనంగా నగర కమిటీ 13 మందితో ఎన్నుకోవడం జరిగింది. ఇందులో ఓబి సభ్యులు 7 మందిని ఎన్నుకోవడం జరిగింది. నగర గౌరవ అధ్యక్షులు కటారి రాములు, నగర అధ్యక్షులు అబ్దుల్ ముజీబ్ ఉపాధ్యక్షులు సయ్యద్ రఫీయో దిన్, సిహెచ్ పండరి, ప్రధాన కార్యదర్శి టి కృష్ణ, సహాయ కార్యదర్శి జి మల్లేష్, కోశాధికారి పి విటల్ కమిటీ సభ్యులు ఉదయ్. ఇర్ఫాన్ జావీద్ ఇమ్రాన్ ఖాన్, ఎండి అనిష్ తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు.
మోటార్ వాహన చట్టం -2019 ని సవరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES