Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ పోలీస్ స్టేషన్ సందర్శించిన మౌంటెన్ స్కూల్ విద్యార్థులు..

జుక్కల్ పోలీస్ స్టేషన్ సందర్శించిన మౌంటెన్ స్కూల్ విద్యార్థులు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని మౌంటెన్ స్కూల్ డైరెక్టర్,  యాజమాన్యం ఉమాకాంత్, ప్రధానోపాధ్యాయుడు మాధవరావు, పి ఈ టి అస్పత్ వార్ వెంకట్ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులు బుధవారం జుక్కల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు జుక్కల్ ఎస్సై నవీన్ చంద్రతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొదటగా విద్యార్థులు పోలీస్ స్టేషన్ వెళ్లగానే సాదరంగా ఆహ్వానం పలికారు. ఎస్సై నవీన్ చంద్ర విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ స్టేషన్ గురించి పూర్తిగా అవగాహన అయ్యేవిధంగా వివరించారు. పాఠశాల అంటే గుడి మాదిరిగా ఉంటుందని అంటారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా ప్రజలకు న్యాయం చేకూర్చే గుడి మాదిరిగానే ఉంటుందని అన్నారు. ప్రజలకు, ఎవరికైనా, ప్రతి ఒక్కరూ సమస్యలలో సతమతమవుతుంటే నిర్భయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి సమస్యను వివరించి ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు.

నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు. ప్రస్తుతము విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులు రాబోయే తరానికి మార్గదర్శకంగా ఉంటూ చట్టాలపై అవగాహన ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పోలీసులు అంటే భయపడవద్దని అన్నారు. వారు కూడా మీ నాన్న , అన్న , తమ్ముడు, కుటుంబ సభ్యుల మాదిరిగానే సమాజంలో అందరితో కలిసి మెలిసి నివసిస్తూ ఉంటారని తెలిపారు. మొదట పోలీస్ స్టేషన్ కు రాగానే రిసెప్షన్ లో ఉన్నవారితో కలిసి మాట్లాడాలని తెలిపారు. సమస్యలు వారికి రాతపూర్వకంగా అందిస్తే, వారు విచారణ చేసి కేసు నమోదు చేస్తారని తెలిపారు. అనంతరం ఎస్సై విచారణ అధికారిగా ఉంటారని వివరించారు.

ప్రతి విభాగం గురించి విద్యార్థులకు ఎస్సై, పోలీసు సిబ్బంది అవగాహన పరిచారు. ఎటువంటి బెనుకు, భయం లేకుండా నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు రావచ్చని తెలిపారు. అనంతరం మౌంటెన్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం కలిసి ఎస్సై నవీన్ చంద్రను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం ఉమాకాంత్,  హెచ్ఎం మాధవరావు, ఉపాధ్యాయుల బృందం, పి ఈ టి వెంకట్, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad