Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

- Advertisement -
  • – కాంగ్రెస్ సర్కార్ కు అరెస్టుల పైన ఉన్న దృష్టి కార్మికుల సమస్యలపై ఎందుకు లేదు.?
    – మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి పెండింగ్ బిల్లులు వేతనాలను వెంటనే విడుదల చేయాలి
    – సీఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్
  • నవతెలంగాణ- కంఠేశ్వర్ 
  • అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని కాంగ్రెస్ సర్కార్ కు అరెస్టుల పైన ఉన్న దృష్టి కార్మికుల సమస్యలపై ఎందుకు లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ సిఐటియు పిలుపు మేరకు చలో హైదరాబాద్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు కార్మికులను పోనివ్వకుండా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కు హౌస్ అరెస్ట్ ముందస్తు అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని వేతనాలు 10000 రూపాయలు నిర్ణయిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది అని విమర్శించారు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కనీస వేతనం అమలు చేయాలని పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని అడుగుతున్న కార్మికులపై పోలీసులతో ఉద్యమాలను అంచివేయాలని చూస్తున్న ప్రభుత్వ ఆలోచన మానుకోవాలని అరెస్టులతో ఉద్యమాలని ఆపలేరని అన్నారు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సకాలంలో బిల్లులు వేతనాలు రాక ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టలేక కుటుంబాలు గడపలేక కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు వేతనాలు వెంటనే చెల్లించాలని కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులు వేతనాలు చెల్లించాలని వంటకు అవసరమైన గ్యాస్ పూర్తిగా ప్రభుత్వమే ఉచితంగా ప్రతి పాఠశాలకు అందజేయాలని కొత్త మెనుకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా కార్మికులకు పదివేల రూపాయల వేతనం అమలు చేయాలని ప్రతీ కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . అరెస్టు చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేని చోట పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -