హీరో రోషన్ కనకాల నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఈనెల13న రిలీజ్ కానుంది. ప్రీమియర్లు 12న ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరో రానా దగ్గుబాటి, డైరెక్టర్ మారుతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ,”కలర్ ఫోటో’ లానే ‘మొగ్లీ’ కూడా ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అవుతుంది. హీరో మోగ్లీ, విలన్ నోలన్.. ఈ క్యారెక్టర్లు చూస్తున్నప్పుడే చాలా మ్యాడ్ నెస్ కనిపిస్తుంది. ట్రైలర్‌లో అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి. భైరవ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. సాక్షికి ఇది ఫస్ట్ సినిమా. విశ్వప్రసాద్ అమేజింగ్ ప్రొడ్యూసర్. ఆయనకి మరిన్ని అద్భుతమైన విజయాలు రావాలని కోరుకుంటున్నాను. నేను ఈ వేడుకకు రావడానికి ప్రధాన కారణం రోషన్. రోషన్ మా ఇంట్లో అబ్బాయి. తనకి సినిమా మీద ఉన్న ప్రేమ, పిచ్చి మీరు స్క్రీన్ మీద చూస్తారు. తనని చూస్తుంటే ‘చిరుత’ సినిమాలో చరణ్‌ని చూస్తున్నట్టుగా అనిపించింది’ అని తెలిపారు.
‘లాస్ట్ వీక్ జరిగిన కొన్ని పరిస్థితుల వలన ఒక పెద్ద సినిమాతో మేము రావాల్సివస్తుంది. ఒక రోజు ఆలస్యంగా రావడం వల్ల ఆ సినిమా చూసిన అందరూ మా సినిమాని కూడా చూస్తారని కోరుకుంటున్నాం. ఈ సినిమా లార్జెస్ట్ స్పాన్ ఇంటెన్స్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ చెప్పారు.
హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ, ‘ప్రతి ప్రేక్షక దేవుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. బాలయ్య ఆశీస్సులు ఆయన ఫ్యాన్స్ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. ‘మోగ్లీ’ తన ప్రేమ కోసం చేసిన యుద్ధం ఈ కథ’ అని చెప్పారు.
‘సందీప్ చాలా టాలెంటెడ్. ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. పీపుల్ మీడియా సంస్థ నుంచి అన్ని రకాల సినిమాలు వస్తున్నాయి. నిర్మాత విశ్వ ప్రసాద్ ఇండిస్టీని ఎంత పోషిస్తున్నారో నాకు తెలుసు. ఈ సినిమా ద్వారా మరొక అద్భుతమైన సక్సెస్ ఇచ్చి పీపుల్ మీడియా సంస్థ ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. మోగ్లీగా రోషన్ చాలా బాగా నటించాడు’ అని డైరెక్టర్ మారుతి తెలిపారు.
ప్రేమ కోసం ‘మోగ్లీ’ చేసిన యుద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



