నవతెలంగాణ -ఆర్మూర్ : బిజెపి పట్టణ అధ్యక్షులు మందుల బాలు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం శివాలయంలో పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం అర్చన ,ప్రత్యేక పూజ నిర్వహించినారు.
భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ నాయకులు , సీనియర్ నాయకులు కలిసి బూత్ స్థాయి నాయకుల సమ్మేళనం సభకు బయలుదేరడం జరిగింది. ఈ సభకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పాల్గొంటున్నందున ఈ యొక్క సభకు భారీ ఎత్తున బయలుదేరినారు.. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త బలోపేతానికి , పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడమే లక్ష్యంగా సాగే యొక్క సభకు భారీ ఎత్తున పార్లమెంట్ పరిధిలోని రెండు జిల్లాల బూత్ అధ్యక్షులుపపాల్గొన్నారు.. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు పాలెపు రాజు, జిల్లా కార్యదర్శి పోల్కం వేణు, ప్రధాన కార్యదర్శులు తిరుపతి నాయక్, కందీశ్ ప్రశాంత్, సీనియర్ నాయకులు, కమిటీ సభ్యులు, శక్తి కేంద్ర ఇన్చార్యులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఎంపీ అరవింద్ జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES