Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ర్ట సమస్యలపై పార్లమెంట్ లో గళమెత్తిన ఎంపీ చామల

రాష్ర్ట సమస్యలపై పార్లమెంట్ లో గళమెత్తిన ఎంపీ చామల

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు 
ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంటు శీతాకాలం సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుండి అత్యధిక ప్రజా సమస్యలు వివిధ సదస్సులో పాల్గొన్న భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఎంపీల పనితీరు, పార్లమెంట్లో జరిగే శాసనాల పట్ల దేశంలో నిష్పక్షపాతంగా పరిశోధించే ప్రతిష్ట కలిగిన పి ఆర్ ఎస్ లేసిటివ్ రీసెర్చ్ సంస్థ శనివారం ఈ విషయాన్ని విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర పాటు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం చురుగ్గా పార్లమెంట్లో జరిగిన చర్చలలోలలో ఢిల్లీలో వివిధ సదస్సులో పాల్గొనడం జరిగిందని పి.ఆర్.ఎస్. సంస్థ నివేదిక తెలిపింది. రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ నుండి గట్టిగా నిలబడి పోరాడిన వ్యక్తిగా గుర్తింపు ఇచ్చింది.

ప్రజా సమస్యలపై అవగాహన రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం మాట్లాడిన తీరును ఆ సంస్థ అభినందించింది. పార్లమెంట్లో ఆయన మాట్లాడిన తీరు ప్రత్యేకంగా నాయకత్వ స్థాయిని పెంచిందని ప్రజా సమస్యల విషయంలో ధైర్యంగా మాట్లాడే స్వభావం ఉందని పార్లమెంటు సమావేశంలో జాతీయస్థాయిలోనే 90 శాతం హాజరుతో ముందు వరుసలో ఉన్నారని సంస్థ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎక్కడ మాట్లాడలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -