Thursday, January 8, 2026
E-PAPER
Homeజిల్లాలునవతెలంగాణ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన ఎంపీ చామల 

నవతెలంగాణ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన ఎంపీ చామల 

- Advertisement -

నవతెలంగాణ- ఆలేరు 
నవతెలంగాణ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ డైరీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదులోని క్యాంప్ కార్యాలయంలో నవ తెలంగాణ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాసరెడ్డితో, నల్లగొండ జిల్లాకు చెందిన రైతులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నవతెలంగాణతో మంగళవారం మాట్లాడుతూ.. సమాజంలో నేడు పత్రికలు వాస్తవాలను దాచి అబద్దాలను ప్రచురిస్తున్నాయని ఎలక్ట్రానిక్ మీడియా వార్తలను ఎవరు నమ్మడం లేని పరిస్థితి వచ్చిందన్నారు. కానీ నవ తెలంగాణ దినపత్రిక ప్రజల పక్షపాతిగా కార్మికుల హక్కుల కోసం పేద ప్రజల కోసం ప్రభుత్వాలు తప్పు చేస్తే నిలదీసే దినపత్రికగా ముందుందన్నారు.

అన్ని పత్రికలకు యాజమాన్యాలు సొంత లాభాల కోసం నడిపిస్తుంటే నవతెలంగాణ పత్రిక మాత్రం ప్రజలచే, ప్రజల కోసం విలువలకు కట్టుబడి నడిపిస్తున్న పత్రికగా కొనియాడారు. మతతత్వం పెరుగుతున్న నేటి తరుణంలో లౌకికవాదాన్ని పెంపొందించే ఇలాంటి పత్రిక అవసరం సమాజానికి చాలా ఉంది అన్నారు. నవతెలంగాణ దినపత్రిక పాఠకులకు రిపోర్టర్లకు ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో పత్రిక మరింత అభివృద్ధి బాటలో పయనించాలని కోరుకుంటున్నానని అన్నారు. వీరితో పాటు నల్లగొండ బత్తాయి రైతుల సంఘం గౌరవ అధ్యక్షులు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి సంఘ సభ్యులు వాసుదేవరెడ్డి దివాకర్ రెడ్డి పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -