ప్రభుత్వ విప్ బిర్ల, ఎంపీ చామల
నవతెలంగాణ – ఆలేరు
యాదిరిగుట్ట మున్సిపాలిటీలో గల ప్రాథమిక ఆరోగ్యరం కేంద్రంలో ఆదివారం ప్రభుత్వ విప్ ఐలయ్యతో ఎంపీ చామల కిరణ్ కుమార్ తో కలిసి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ .. ఆలేరు నియోజకవర్గంలో ఆదివారం రోజు మూడు మండలాల్లో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం నియోజకవర్గం అదృష్టం అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తాగు నీటి ప్రాముఖ్యత గుర్తించిన ఎంపి చామాల కిరణ్ కుమార్ రెడ్డి ఆలేరుకు మొదటి ప్రాధాన్యతనిచ్చి మూడు చోట్ల ప్లాంట్ మంజూరు చేయడం పట్ల అభినందనలు తెలిపారు.
ఆప్టిమస్ సేవలను కొనియాడారు.ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇండ్లు సన్న బియ్యం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రేషన్ కార్డు గల ఇంటి కి 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నవి పేర్కొనకుండా చేసినవి అనేక ఉన్నాయన్నారు.హెల్త్ సెంటర్ లో జరిగిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రజలనుదేశించి వివరించారు.ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదలకు అండగా ఉండేదని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనాడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి అన్నారు.
వ్యవసాయదారులకు పనిముట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ బీసీలకు 50 శాతం సబ్సిడీ మీద ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీని ప్రజలు బొంద పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్ హేమేందర్ గౌడ కౌన్సిలర్ గొల్లపల్లి భరత్ కాంగ్రెస్ నాయకుల అరె ప్రశాంత్ కె భాస్కర్ ఏఎన్ఎంలు పాల్గొన్నారు.