Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిఓ లకు శిక్షణా తరగతులు నిర్వహించిన ఎంపీడీవో 

పిఓ లకు శిక్షణా తరగతులు నిర్వహించిన ఎంపీడీవో 

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
మండలంలోని గ్రామపంచాయతీ మూడవ విడత ఎన్నికల సందర్భంగా జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో పీవోలకు టీఓటిలచే శిక్షణ ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల లో ఏర్పాటుచేసిన పిఓ లో శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఎంపీడీవో , టి ఓ టి లు  మాట్లాడుతూ.. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు గ్రామాలలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. శిక్షణ తరగతులు తెలియపరిచిన అంశాలను ప్రతి ఒక్క పిఓలు కచ్చితంగా నిబంధనలను అనుసరించి పాటించాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా మండల ఎన్నికల అధికారికి తెలిస వెంటనే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. సమస్య తీవ్రరూపం దాల్చకుండా వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. శిక్షణ తరగతులను మూడు విడతలుగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ శిక్షణా తరగతులను విజయవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -