Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇండ్లు మంజూరైన లబ్దిదారులు వెంటనే నిర్మాణాలు చేపట్టాలి: ఎంపీడీఓ

ఇండ్లు మంజూరైన లబ్దిదారులు వెంటనే నిర్మాణాలు చేపట్టాలి: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్  మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టు కొనుటకు లబ్ధిదారులకు ఎంపీడీవో శ్రీనివాస్ స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి గురువారం ప్రోత్సహించడం జరిగింది. ఈ సందర్భంగా బస్వాపూర్ గ్రామంలో క్షేత్రా స్థాయి పరిశీల చేసి ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన గృహ లబ్ధిదారులను ఇంటింటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ఇల్లు కట్టుకునే విధంగా ప్రోత్సహించడం జరిగింది.

మంజూరైన లబ్ధిదారులు వెనువెంటనే పనులను ప్రారంభించి గృహ నిర్మాణాలు పూర్తిచేయాలని సూచించారు. నిర్మాణాలు చేపడుతున్న వారికి మూడు విడుదలుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. నిర్మాణంలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి వివరించాలని వెనువెంటనే విచారించి సమస్యను పరిష్కరించి గృహ నిర్మాణం హాజవుగా జరిగే విధంగా సహకరిస్తామని ఎంపీడీవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు జిపి కార్యదర్శి మరియు గృహనిర్మాణ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -