నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. లొంగన్, గుండూరు గ్రామాలలో ఇందిరమ్మ పథకంలో మంజూరైన లబ్ధిదారుల ఇండ్లను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ప్రభుత్వము నిర్దేశించిన కొలతల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం విధించిన కొలతల ప్రకారం నిర్మిస్తేనే వాటికి బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. స్థానికంగా ఇంటి నిర్మాణం విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా మండల కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని వీలైనంతవరకు సమస్యను గ్రామంలోని పరిష్కరించి ఇంటి నిర్మాణ లబ్ధిదారులకు ఆటంకం కలగకుండా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు ఉపాధి హామీ ఈసీ స్వామి దాస్, లొంగన్ గ్రామపంచాయతీ కార్యదర్శి అనురాధ, గుండూరు గ్రామపంచాయతీ కార్యదర్శి నాగనాథ్, ఎఫ్ఏ లు, మెట్లు, ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



