Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీఓ

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని రాజరాజేశ్వరి నగర్ ప్రాథమిక పాఠశాలలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాన్ని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ఇతరత్రా వివరాలను పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ ను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సాయంత్రం సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వాటిని సరిచేసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. పులి కేంద్రం చుట్టుపక్కల పెరిగిన పిచ్చి గడ్డిని, ఇతర మొక్కలను పంచాయతీ సిబ్బందితో వెంటనే తొలగించి శుభ్రం చేయించాలని. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు.గ్రామపంచాయతీ కార్యాలయంపై సోలార్రైజేషన్ ఏర్పాటు కోసం సిద్ధం చేసిన ప్రతిపాదనలను ఆయన పరిశీలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -