Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రొఫెసర్‌ జయశంకర్‌ కుఎంపీడీఓ ఘన నివాళులు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ కుఎంపీడీఓ ఘన నివాళులు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని మండలం లోని అన్ని ప్రభుత్వ కార్యా లయాల్లో  బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం లోనిప్రజా పరిషత్ కార్యాలయం లో మండల అభివృద్ధి అధికారి ఉమాదేవీ,ఎంపీఓ సుధీర్ కుమార్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి  పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓమాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి జీవితాన్ని అర్పించిన గొప్పవ్యక్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి స్వరాష్ట్ర సాధనకు జయశంకర్‌ జీవితాన్ని అంకితం చేశారన్నారు.

రాష్ట్ర సాధనకు జీవితకాలం సాధన చేశారని కొని యాడారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో వివిధ రంగాల మేధావులను, ఉద్యోగ, వ్యాపారులను, విద్యార్థులను ఒక్క తాటిపైకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమం సూపరిండెంట్ హఫీజ్ ఖాన్,సీనియర్ అసిస్టెంట్ మురళీధర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు పంకజ్ రెడ్డి,ఠాగూర్,కంప్యూటర్ ఓపరేటర్ ఎల్లయ్య,కార్యదర్శి రాధ,పగడాల నాగరాజుభానావత్ మునిలాల్ అటెండర్ జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -