నవతెలంగాణ – జుక్కల్
బిజ్జల్ వాడి గ్రామంలో ఇందిరమ్మ పథకంలో మంజూరైన నిర్మాణాలను జుక్కల్ ఎంపిడివో శ్రీనివాస్ బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఎంపీడీవో మాట్లాడుతూ నిర్మాణాలు తరితగతిన నిర్మించాలని సూచించారు. త్వరలో నిర్మాణాలకు సంబంధించిన బిల్లులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు. నిబంధనలను ప్రకారం ఇందిరమ్మ గృహ నిర్మాణాలు చేయాలని , లబ్ధిదారులు ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు చేస్తే వాటికి నిధులు మంజూరు చేయడం జరగదని కరాఖండిగా లబ్ధిదారులకు తెలియజేశారు. ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా తనకు ఫోన్ ద్వారా అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనుకూలతను పట్టి కార్యాలయాన్నికైనా వచ్చి సమస్యలను తెలియజేస్తే వాటి పరిష్కార మార్గం చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి లబ్ధిదారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
బిజ్జల్ వాడిలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ శ్రీనివాస్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES