Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ పీహెచ్సీని సందర్శించిన ఎంపీడీఓ శ్రీనివాస్

జుక్కల్ పీహెచ్సీని సందర్శించిన ఎంపీడీఓ శ్రీనివాస్

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ 30 పడకల ఆస్పత్రిని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో తిరుగుతూ పరిశుభ్రతను పరిశీలించారు. ఆస్పత్రి మొత్తం క్లీన్ గా కనిపించడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడి సమస్యల గురించి చర్చించారు. అనంతరం ఎంపీడీవో బీపీ ఆరోగ్య పరిస్థితిని చెకప్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రికి అత్యధికంగా పేదలే వస్తారని అన్నారు. మారు మూల గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ రకాల సమస్యలతో అనారోగ్య కారణాలతో చికిత్స కొరకు ప్రభుత్వ ఆస్పత్రిని ఎంచుకోవడం జరుగుతుంది. వైద్యుడు సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండి పేద ప్రజలకు చికిత్స అందిస్తూ వృత్తికి న్యాయం చేయాలని అన్నారు. అనంతరం అవుట్ పేషెంట్ రిజిస్టర్ను పరిశీలించారు. ఆస్పత్రిలోని మందులు నిల్వ ఉంచే గదిని పరిశీలించి మందుల గడువు తేదీలను క్షుణ్ణంగా చూడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు ఆస్పత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad