Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఛలో హైదరాబాద్ కు తరలిన ఎమ్మార్పీఎస్ నాయకులు 

ఛలో హైదరాబాద్ కు తరలిన ఎమ్మార్పీఎస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర: ఛలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు మండలం నుండి శనివారం పెద్ద ఎత్తున సభకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు సైదులు, సిద్దు, శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే క్రమంలో భాగంగా, వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వరరావు, ఐలయ్య, యాకయ్య, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -