Wednesday, July 2, 2025
E-PAPER
Homeఆటలుఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఎం.ఎస్‌ ధోని

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఎం.ఎస్‌ ధోని

- Advertisement -

లండన్‌ : భారత క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ప్రఖ్యాత ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకోనున్నాడు. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమర్స్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ సహా పాత్రికేయులతో కూడిన ప్యానల్‌ ఎం.ఎస్‌ ధోని సహా ఏడుగురు క్రికెటర్లను (ఐదుగురు మెన్‌, ఇద్దరు ఉమెన్‌) హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి తీసుకున్నారు. లండన్‌లో జరుగబోయే కార్యక్రమంలో ధోని సహా ఇతర క్రికెటర్లకు ఐసీసీ రూపొందించిన ప్రత్యేక క్యాప్‌లను బహూకరిస్తారు. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో 115 మంది క్రికెటర్లు ఉండగా.. అందులో 11 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. 2004లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ధోని.. 2007లో సారథ్య పగ్గాలు అందుకున్నాడు. 2007 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌, 2011 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌, 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ విజయాలను భారత్‌ను అందించాడు. 350 వన్డేల్లో 50.57 సగటు, 10 సెంచరీలు, 73 అర్థ సెంచరీలతో 10773 పరుగులు చేసిన ధోని.. 90 టెస్టుల్లో 4876 పరుగులు సాధించాడు. 2019 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో పోరు ధోని కెరీర్‌ ఆఖరు మ్యాచ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -