మంత్రి వాకిటి శ్రీహరికి మెపా వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రతి జిల్లాలో ముదిరాజ్ భవనాలు నిర్మించాలని ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ కోరింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్, రాష్ట్ర కమిటీతో పాటు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు దుండి అశోక్ ముదిరాజ్ మత్స్య పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. భవన స్థలాల కేటాయింపులపై అసెంబ్లీలో చర్చించి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని వారు కోరారు. భవనాలు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఉపయోగడపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు చెన్న రాములు ముదిరాజ్, బలరాం ముదిరాజ్, పుట్టి రాజు ముదిరాజ్, శ్రీనివాస్, రాజు, రమేష్‌లు పాల్గొన్నారు.
ప్రతి జిల్లాలో ముదిరాజ్ భవనాలు నిర్మించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



