Thursday, February 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఓటేసిన‌ ముహమ్మద్ యూనస్

ఓటేసిన‌ ముహమ్మద్ యూనస్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఆదేశ రాజ‌ధాని ఢాకాలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఇవాళ బంగ్లా వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.ఉదయం 7:30 గంటలకు ఓటింగ్ ప్రారంభం అయ్యింది. సాయంత్రం 4:30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు వేయనున్నారు. సాయంత్రం 4:30 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. 5 లక్షల మంది సిబ్బంది పేపర్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. గురువారం రాత్రికి ఫలితాలు వెలువడనున్నాయి.

మొత్తం 300 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. అభ్యర్థి మరణంతో ఒక స్థానంలో పోలింగ్ నిలిపివేశారు. మిగతా 299 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1 మిలియన్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -