689 ఓట్ల భారీ మెజారిటీ
నవతెలంగాణ – కట్టంగూర్
కట్టంగూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా ముక్కాముల శ్యామల శేఖర్ 689 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. శనివారం నవ తెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజలు తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. తన గెలుపు కొరకు కృషిచేసిన ప్రతి కార్యకర్తకు తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
14 మంది వార్డు సభ్యులు గెలుపొందారు.1వవార్డు సభ్యునిగా కళ్లెం నాగేశ్వరరావు, 2వ వార్డు సభ్యుడిగా ఏనుగు సైదులు, 3వ వార్డు సభ్యుడిగా అయితగోని సైదులు,4వవార్డు సభ్యులుగా ఏకుల సుజాత,5వ వార్డు సభ్యులు గా శ్రీరామ్ సంధ్య,6వ వార్డు సభ్యులుగా జెల్లా లావణ్య,7వ వార్డు సభ్యులుగా బొమ్మగాని మహేష్,8వ వార్డుసభ్యులుగా గుండు రాంబాబు, 9వ వార్డు సభ్యులుగా చిక్కుళ్ళ శివాని,10వ వార్డు సభ్యులుగా ఐతగోని సైదమ్మ, 11వ వార్డు సభ్యులుగా కానుగు శ్రీను, 12వ వార్డు సభ్యులుగా మైనం ఉమా,13 వ వార్డు సభ్యులుగా యర్కల శశిధర్ ,14వ వార్డు సభ్యులుగా పురకం శ్రీను గెలుపొందారు.
కాగా సర్పంచ్ స్థానానికి 4గురు అభ్యర్థి పోటీ పడగా కడమంచి రాధకు 28 ఓట్లు, బుచ్చల నాగమ్మకు 2212 ఓట్లు, ముక్కామల శ్యామలకు 2901, శ్రీపాద పుష్పలతకు 06 ఓట్లు లభించాయి. నాగమ్మ పై శ్యామల 689 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వార్డు సభ్యులలో అత్యధికంగా 188 ఓట్ల మెజార్టీతో ఏకుల సుజాత గెలుపొందగా, అత్యల్పంగా 9 ఓట్ల మెజార్టీతో అయితగోని సైదులు గెలుపొందారు.



