నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల తెలంగాణలో లోకల్ బాడీ పోల్స్ ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 12వేల పైగా గ్రామపంచాయతీ స్థానాలకు గతేడాది డిసెంబర్ నెలల్లో 11,14,17 తేదీల్లో మూడు దఫాలు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధిక మొత్తంలో అధికారం పార్టీ కాంగ్రెస్ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. అదే విధంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్ కూడా తన బలాన్ని పుంజుకొని 4వేల స్థానాలకు పైగా సర్పంచ్ సీట్లను గెలుచుకుంది. అయితే రాష్ట్ర రాజకీయల పరంగా కారాలు మిరియాలు నూరుకునే బీఆర్ ఎస్- బీజేపీ కలిసి పోటీ చేసిన ఉదంతాలు అనేకం చూశాం. అదే మాదిరిగా మహారాష్ట్ర రాజధాని ముంబాయి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా వింత సంఘటన చోటు చేసుకుంది.
కేంద్ర రాజకీయల పరంగా నిత్యం కోట్లాటకు సిద్దంగా ఉండే కాంగ్రెస్-బీజేపీ-కాంగ్రెస్ నేషలిష్ట్(అజిత్ పవార్ వర్గం) పార్టీలు జట్టుకట్టాయి. “అంబర్‌నాథ్ వికాస్ అఘాడి” అనే కూటమిని ఏర్పాటు చేశాయి. పథానే జిల్లాలోని అంబర్‌నాథ్ మునిసిపల్ కౌన్సిల్‌లో జరిగిన రాజకీయ పరిణామాలు దేశంలోనే కాకుండా దేశంలో కూడా పెద్ద గందరగోళాన్ని సృష్టించాయి.ఈ కూటమిలో 14 మంది బీజేపీ కౌన్సిలర్లు, 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఎన్‌సిపి (అజిత్ పవార్ వర్గం) నుండి నలుగురు మరియు ఒక స్వతంత్ర కార్పొరేటర్ ఉన్నారు. మున్సిపల్ అధ్యక్ష పదవిని చేర్చడంతో, కూటమి బలం 32కి పెరిగింది, దీనితో బీజేపీకి మున్సిపల్ కౌన్సిల్‌లో సౌకర్యవంతమైన మెజారిటీ లభించింది.



