కొచ్చి బ్లూ స్పైకర్స్‌పై 3-2తో గెలుపు
ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ 4
హైదరాబాద్ : ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాల్గో సీజన్‌లో ముంబయి మీటియర్స్ అజేయ జోరు కొనసాగుతుంది. మంగళవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో హౌరాహౌరీగా జరిగిన మ్యాచ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌పై ముంబయి మీటియర్స్ 3-2తో విజయం సాధించింది. 15-7, 7-15, 13-15, 15-8, 15-11తో ముంబయి మీటియర్స్ సీజన్లో నాల్గో విజయం ఖాతాలో వేసుకుంది. తొలి నాలుగు సెట్లలో కొచ్చి బ్లూ స్పైకర్స్, ముంబయి మీటియర్స్‌లు సమవుజ్జీలుగా నిలిచాయి. నిర్ణయాత్మక ఐదో సెట్లో ఆధిపత్యం చూపించిన ముంబయి మీటియర్స్ సెమీఫైనల్ బెర్త్‌కు చేరువైంది. పీవీఎల్4లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌కు ఇది హ్యాట్రిక్ పరాజయం కాగా.. ఓవరాల్‌గా ఐదు మ్యాచుల్లో నాల్గో ఓటమి. కార్తీక్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మరో మ్యాచ్‌లో కోల్‌కతా థండర్‌బోల్డ్స్‌పై
15-11, 15-8, 15- 6తో గోవా గార్డియన్స్ గెలుపొందింది.