వర్షాకాల సీజన్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ
నవతెలంగాణ – పరకాల
వర్షాకాల సీజన్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరకాల మున్సిపల్ సిబ్బంది 24/7 అందుబాటులో ఉండి సేవలు అందించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ తెలిపారు. భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా తలెత్తే ప్రమాదాలు నివారించడానికి అత్యవసర సేవల కోసం రెస్క్యూ టీవమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అత్యవసర సమయాల్లో ప్రజలు 7100537570 లేదా 9177557767 ఫోన్ నంబర్లలో సంప్రదించవలసిందిగా సూచించారు.
అంతేకాకుండా కమిషనర్ పట్టణంలోని పలు కాలనీలలో పర్యటించి నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి ఆయిల్ బాల్స్, స్ప్రే, బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది. నీటి నిలువ ప్రాంతాలను గుర్తించి ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండకుండా డైవర్షన్ చేసేలా మున్సిపల్ జవాన్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజల తో పాటు పలువురు మున్సిపల్ సిబ్బంది కమిషనర్ తో పాటు ఉన్నారు.