Tuesday, November 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
మంగళవారం భీంగల్ పట్టణంలో జరిగిన మున్సిపల్ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మఖ్య అతిథిగా తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపల్ కార్మికులు ప్రజల మౌలిక సదుపాయాల కొరకు నిత్యం పనిచేస్తున్నారని, వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆయన అన్నారు. ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రతి సంవత్సరం కార్మికులకు రెండు జతల బట్టలు,చెప్పులు ఇవ్వాలని , నెలనెలా సబ్బులు ,నూనెలు పనిముట్లు అందచేయాలని అందజేయాలని మూడు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలను నిర్వహించి తగిన వైద్యం అందించాలని ఆయన అన్నారు.

కానీ ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసే పద్ధతుల్లో చట్టాల్లో మార్పులు తీసుకురావటం జరుగుతుందని అందువల్ల కార్మిక వర్గం మరింత సంఘటితం గా పోరాటం చేయగలిగినప్పుడే తమ హక్కులను కాపాడుకోగలుగుతారని ఆయన అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ పని దినాలను పెంచుకోవడంతో పాటు చట్టాల అమలు కోసం కలిసి పోరాడాలని. అందుకొరకు రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 5 నుండి 9వ తేదీ వరకు మెదక్ పట్టణంలో జరగబోతున్నాయని ఈ మహాసభల్లో కార్మిక పోరాటాల పైన నిర్ణయం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ యూనియన్ నాయకులు పోషన్న, గంగవ్వ, బాలవ్వ, రాజన్న తదితరులు పాల్గొన్నారు.   

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -