Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం9 గేట్ల ద్వారా మూసీ ప్రాజెక్టు నీటి విడుదల

9 గేట్ల ద్వారా మూసీ ప్రాజెక్టు నీటి విడుదల

- Advertisement -

నవతెలంగాణ-కేతేపల్లి
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో శనివారం ప్రాజెక్టు తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 2,3,4,5,6,7,8,10,12 క్రస్ట్‌ గేట్లను 2 అడుగుల మేరకు ఎత్తి దిగువకు 12297.78 క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 8823.77 క్యూసెక్కుల నీరు వస్తున్నట్టు డ్యాం ఇంజనీర్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 643 అడుగుల వద్ద స్థిరంగా ఉంది. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.15 టీఎంసీల నీరు నిలువ ఉంది. ప్రాజెక్టు కూడి ఎడమ కాల్వల ద్వారా 530.64 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్ధాయిలో నిండటంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని నీటిపారుదల శాఖ అధికారులు డీఈ చంద్రశేఖర్‌, ఏఈ మమత, ఉదరు కుమార్‌, మధు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -