Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి 

సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి 

- Advertisement -

పాలకుర్తి సీఐ జానకిరామ్ రెడ్డి 
నవతెలంగాణ-పాలకుర్తి

సైబర్ నేరాల పట్ల విద్యార్థినీలు అవగాహన కలిగి ఉండి సైబర్ మోసాలకు తల్లిదండ్రులు మోసపోకుండా అవగాహన కల్పిస్తూ చైతన్యం చేయాలని పాలకుర్తి సీఐ వంగాల జానకి రమ్ రెడ్డి విద్యార్థినీలకు సూచించారు. వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్, జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట ఏసీపి అంబటి నర్సయ్య సూచనలతో గురువారం మండల కేంద్రంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపాల్ సందరాజా స్వరూప అధ్యక్షతన సైబర్ నేరాల పట్ల విద్యార్థినీలకు పాలకుర్తి ఎస్సై దూలం పవన్ కుమార్ తో కలిసి సిఐ జానకిరామ్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ జానకిరామ్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ మోసాలతో అనేకమంది మోసపోయారని, లక్షలు కొల్లగొట్టుకున్నారని తెలిపారు.

ఎస్బిఐ పేరుతో వచ్చే లింకులను ఓపెన్ చేసి ఓటీపీల ద్వారా సమాచారాన్ని అందజేస్తే ఫోన్లో ఉన్న డేటా తో పాటు బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు సొమ్మును లూటీ చేస్తారని తెలిపారు. ఆన్లైన్ మోసాలు ఎక్కువయ్యాయని, ఇంటర్నెట్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని వివరించారు. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ ల ద్వారా వచ్చే మోసపూరితమైన లింకులను క్లిక్ చేసి ఓపెన్ చేయరాదని సూచించారు. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ల ద్వారా ఫోటోలను బ్లాక్ మెయిల్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతారని సూచించారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థినీలు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిన బాధితులు 1930 నంబర్ కు సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మేకల లింగారెడ్డి తో పాటు పోలీస్ సిబ్బంది, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -