జూనియర్ సివిల్ జడ్జి మిథున్ తేజ
నవతెలంగాణ – అలంపూర్
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి మిథున్ తేజ అన్నారు. శనివారంఅలంపూర్ మండల పరిధిలోని లింగనవాయి గ్రామంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ వ్యక్తుల మధ్య తగాదాలు ఏర్పడినప్పుడు గొడవలు పడకుండా కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలని, ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ప్రతి ఒక్కరికి న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.18 సంవత్సరాలు నిండని చిన్నారులకు, ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని, బాలికలకు బాల్యవివాహాలు చేయడం నేరమని, అలా చేసిన తల్లిదండ్రులు, వారికి సహకరించిన వారు కూడా శిక్షార్హులవుతారు అన్నారు.
విద్యార్థులకు మొబైల్ ఫోన్లు ఇవ్వరాదని, విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదవాలని, సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరాల పారిన పడితే పోలీసు అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గవ్వల శ్రీనివాసులు, న్యాయవాదులు నారాయణరెడ్డి, గజేంద్ర గౌడ్, మధు, అప్రోజ్, చైతన్య, పంచాయితీ కార్యదర్శి రవితేజ, ఏఈఓ నీలిమ, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, రైతులు యువకులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



