Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅతిథి అధ్యాపకులను రెన్యూవల్‌ చేయాలి

అతిథి అధ్యాపకులను రెన్యూవల్‌ చేయాలి

- Advertisement -

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో అతిథి అధ్యాపకులను తక్షణమే రెన్యూవల్‌ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ రజినీకాంత్‌, కార్యదర్శి టి నాగరాజు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలు ప్రారంభమై నెలన్నర దాటిందని తెలిపారు. అతిథి అధ్యాపకు లను ఇంకా రెన్యూవల్‌ చేయలేదని పేర్కొన్నారు. దీంతో కొన్ని సబ్జెక్టులకు పాఠాలు బోధించేందుకు అధ్యాపకుల్లే రని తెలిపారు. గత విద్యాసంవత్సరంలో 1,654 మంది అతిథి అధ్యాపకులు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేశారని గుర్తు చేశారు. విద్యార్థులు నష్టపోకుండా వారు సేవలందించారని తెలిపారు. వారిని తక్షణమే రెన్యూవల్‌ చేస్తూ ఉత్తర్వులను జారీ చేయా లని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ కాలేజీల్లో సిలబస్‌ పూర్తి చేసి పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తుంటే ప్రభుత్వ కాలేజీల్లో బోధించేందుకు అధ్యాపకుల్లేరని తెలిపారు. తాత్కాలిక పద్ధతిలో అనేక ఏండ్లుగా పనిచేసిన అతిథి అధ్యాపకులను వెంటనే నియమించాలని కోరారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు అధ్యాపకులను నియమించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -