ఆలేరు గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని ఆలేరు గ్రామ అభివృద్ధి నా లక్ష్యం అంటూ ఆ గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆలేరు గ్రామంలో మూడవ వార్డు మరియు నాలుగో వార్డు లో పర్యటించి సమస్యలను గుర్తించి పరిష్కార మార్గమే అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అలేరు గ్రామంలోని 3&4 వార్డులలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్లు,విద్యుత్ స్తంబాలు, కొత్త పైప్ లైన్లు, సి సి రోడ్ లు, పారిశుద్దం ,త్రాగునీరు వంటి ఏమైనా ఆ ప్రాంతంలో ఉన్నాయా లేవా అని ప్రజలు అడిగి తెలుసుకున్నారు.
అదే కాకుండా గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఏమైనా ఉంటే వాటిని నా దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సహకారంతో కోట్లాది నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అన్ని రంగాలు అభివృద్ధి పరుస్తానని ఈ సందర్భంగా తెలిపారు. సమస్యలు లేని గ్రామంగా ఉండడం కోసమే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయత కార్యదర్శి మణిదీప్ ,వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



