- Advertisement -
పార్టీలకతీతంగా బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తాం..
బీసీ జెఎసి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన జాజుల లింగం గౌడ్
నవతెలంగాణ – మిర్యాలగూడ
బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా ఉద్యమిస్తానని నూతనంగా ఎన్నికైన బీసీ జేఏసీ కన్వీనర్ జాజుల లింగం గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 23 సంవత్సరాల నుంచి పార్టీలకు అతీతంగా బీసీల అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని పార్టీలకతీతంగా బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తానని, బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తానని, బీసీల ఆందోళనకు మద్దతు ఇవ్వని పార్టీలకు తగిన బుద్ధి చేద్దామని అన్నారు.
- Advertisement -



