హీరో అల్లరి నరేష్ నటించిన థ్రిల్లర్ ’12ఎ రైల్వే కాలనీ’. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షో రన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. ఈ సినిమా ఈనెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కామాక్షి భాస్కర్ల ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు. అనిల్ చేసిన ‘పొలిమేర’తో మా జర్నీ స్టార్ట్ అయింది. ఆ సినిమాలో నా పెర్ఫార్మెన్స్‌ని అందరూ అభినందించారు. ఇప్పటి వరకు చేసింది రెండే సినిమాలు. ఆ రెండు సినిమాల్లో కూడా నేను ఉన్నాను. డైరెక్టర్ నానితో ‘పొలిమేర’ నుంచే మంచి జర్నీ ఉంది. అనిల్ సూపర్‌విజన్‌లో నాని డైరెక్ట్ సినిమాని అద్భుతంగా తీశారు. ఇందులో నరేష్‌కి జోడిగా కనిపిస్తాను. నా క్యారెక్టర్ పేరు ఆరాధన. నా క్యారెక్టర్ ఎక్కడ నుంచి వచ్చింది?, ఏం చేస్తుందనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తన పని మీదే శ్రద్ధ పెట్టే క్యారెక్టర్.
అలాంటి లైఫ్‌లో వచ్చిన ప్రేమ స్టోరీ ఎలా ముందుకెళ్ళింది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నా క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. ఈ క్యారెక్టర్ లేకపోతే ఈ కథ లేదు. సినిమా చూసిన తర్వాత నా క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. ఇది మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్. నెక్స్ట్ ఏం జరగబోతుందని ఎగ్జైట్‌మెంట్ ఆడియన్స్‌లో ఉంటుంది. నరేష్‌తో ఇంతకుముందు ‘ఇట్లు మారేడుమిల్లి’ సినిమా చేశాను. ఈ సినిమాలోనూ ఆయనతో నటించడం అనేది నా కెరీర్‌కి చాలా మైలేజ్ ఇస్తుంది. ఇందులో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. ఆ లవ్ స్టోరీ నుంచే థ్రిల్లర్ సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. ఇందులో మూడు పాటలు కూడా కథకు చాలా హెల్ప్ అవుతాయి. నేను హీరోయిన్‌తో పాటు అన్ని రకాల పాత్రలు చేస్తున్నాను. ‘లైలా, డెకాయిట్ ‘ ఈ సినిమా సైన్ చేయడానికి ముందు చేసినవే. నవీన్ చంద్రతో చేసిన ‘షో టైం’ అనేది తర్వాత చేశాను. నేను ఏ పాత్ర చేసినా ఆ కథలో నా పాత్ర చాలా కీలకంగా ఉండాలని ఆశిస్తాను.
కథలో నా పాత్ర చాలా కీలకం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



